Studio18 News - ANDHRA PRADESH / : Bus Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కు కూడా గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బార్ అసోసియేన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆగిఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News