Thursday, 14 November 2024 05:40:03 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Vijayasai Reddy: ఆ భూములతో నాకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

Date : 24 October 2024 02:08 PM Views : 32

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 100 రోజుల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని విజయసాయి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఎన్సీసీ, దసపల్లా భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు జరిగిందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు