Tuesday, 31 March 2026 04:35:21 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల

Date : 24 March 2026 03:09 PM Views : 7

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ చూసి అంతా తుస్సుమనిపించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వాస్తవ ఖాళీలు ఎన్ని, వాటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతోపాటు, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :