Studio18 News - ANDHRA PRADESH / Nandyal : నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం సిద్దేపల్లి రస్తా మీదుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ నేపథ్యంలో భాగంగా సిద్దేపల్లి ముష్టేపల్లి పెద్దనంతపురం డైరీ కొట్టాల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని కొనసాగించాలని ఇందులో భాగంగా అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు యేసురత్నం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వంద సంవత్సరాలకు పైగా స్వాతంత్రం రావడానికి ముందు పలు గ్రామాలకు సంబంధించి శాశ్వతంగా నిర్మించిన రోడ్డు మార్గాన్ని NHహైవే అధికారులు మూసి వేయడం అన్యాయమన్నారు. రాత్రివేళ వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థి విద్యార్థినులు మహిళలు గ్రామస్తులు ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉందన్నారు. పాలకులు జిల్లా కలెక్టర్ హైవే అథారిటీ అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలన్నారు.
Admin
Studio18 News