Thursday, 12 March 2026 12:11:54 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Watch: నది మధ్యలో సడెన్‌గా ఆగిపోయిన పడవ.. తర్వాత ఏం జరిగిందంటే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది.. వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు ప్రయాణిస్తున్న పడవలో ఒక్కసారిగా సాంకేతిక లోపం సంభవించింది.. ఇం

Date : 14 November 2025 07:48 PM Views : 153

Studio18 News - ANDHRA PRADESH / NTR District : ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వరకు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే గురువారం కూడా రోజూలానే ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుంచి 30 మంది ప్రయాణికులతో ఒక పడవ బయల్దేరింది. అయితే నది మధ్యలోకి రాగానే పడవలోని ఇంజన్ బ్యాటరీ పనిచేయడం ఆగిపోయింది. దీంతో నది మధ్యలో పడవ నిలిచి పోయింది. అది కూడా కృష్ణానది ప్రవాహం భారీగా ఉన్న ప్రదేశంలో.. ఇక ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుంలో ఏమో అనేలోపే నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కృష్ణానది ప్రవాహంలో పడవ కొంత దూరం కొట్టుకుపోయి నిలిచిపోయింది. నదిలో పడవ కొట్టుకుపోవగాన్ని గమనించిన అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించారు. 30 మంది ప్రయాణికులతో సహా పడవని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు మొదట ఆందోళనకు గురయ్యారు. కానీ స్థానికుల సహాయంతో వాళ్ళందరూ ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.. పడవలో ప్రయాణం చేసే వారికి ఎలాంటి గాయాలు ప్రమాదం సంభవించలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జిల్లా నుండి గుంటూరు జిల్లా వైపు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా పడవలను నడిపిస్తూ.. కనీసం ప్రయాణికులు లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :