Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని ఆయన కోరారు. వైఎస్ వివేకాను చంపినట్టే ధర్మారెడ్డిని కూడా చంపేశారనే అనుమానం తనకు కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఏం జరిగిందనే విషయాలను ధర్మారెడ్డి బయటకు వచ్చి చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కారుకూతలు కూశాడని అన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ పాలేరులా పని చేశారని విమర్శించారు. నిబంధనలు పట్టించుకోని పొన్నవోలు న్యాయ పట్టా రద్దు చేయాలని... హైకోర్టు సుమోటోగా తీసుకుని పొన్నవోలుపై విచారణ జరపాలని కోరారు. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా వాగితే బుద్ధి చెపుతామని హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపై నిన్న డ్రామా ఆడారని బుద్దా మండిపడ్డారు. తాను హిందువు అని చెప్పుకుంటున్న భూమన... వాళ్ల ఇంట్లో క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేయలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నించారని అన్నారు. ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News