Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొన్ని రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత వారం రోజులుగా చిరుత హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న సామెత మాదిరిగా రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద మత్స్యకారులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎఫ్ఓ ప్రసాదరావు నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలన చేశారు. గౌతమి వంతెన సమీపంలో చిరుత కదలికలపై ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. దీంతో ఆ ప్రాంతంలో చిరుత సంచారంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని డీఎఫ్ఓ ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బోటు సాయంతో గోదావరి మద్యలంకలో చిరుత ఆచూకీకై తాము పరిశీలన చేస్తామని ఆయన తెలిపారు.
Admin
Studio18 News