Friday, 13 December 2024 08:04:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YS Sharmila: లడ్డూ అంశంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్టుగా ఉంది: షర్మిల

Date : 02 October 2024 05:16 PM Views : 22

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే... ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్టుగా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని అందరి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కోరిందని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ను కూడా కోరామని తెలిపారు. లడ్డూ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా తమతో ఏకీభవిస్తోందని అన్నారు. లడ్డూ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని షర్మిల తెలిపారు. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారని, మరొకరు పశ్చాత్తాప దీక్షలంటున్నారని, ఇంకొకరు ప్రక్షాళన పూజలు అంటున్నారని విమర్శించారు. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఈ అంశానికి మతం రంగు పులుముతున్నారని చెప్పారు. ఈరోజు విశాఖలో గాంధీ జయంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అంతకు ముందు విమానాశ్రయంలో షర్మిలకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల పైవ్యాఖ్యలు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు