Studio18 News - ANDHRA PRADESH / : కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా ఉండదని చెప్పారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని... జగన్ ఇంటి ముందు చేయాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది జగన్ కాదా? అని గొట్టిపాటి ప్రశ్నించారు. గతంలో రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్ ఇచ్చిందని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ విద్యుత్ రంగ వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. సొంత మనుషులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారని అన్నారు. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.
Also Read : పోలీస్ స్టేషన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పరామర్శించిన హరీశ్ రావు
Admin
Studio18 News