Studio18 News - ANDHRA PRADESH / : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూ. 328 కోట్లు ఖర్చు చేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ ఏడాది మార్చి 16 నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 6 వరకు మొత్తంగా చేసిన ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం.. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల కోసం రూ. 328,36,60,046 ఖర్చు చేసింది. ఇందులో స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణం కోసం రూ. 21.42 కోట్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, కేబుల్, వెబ్‌సైట్, టీవీ చానళ్లలో పార్టీ సాధారణ ప్రచారం కోసం రూ. 87.36 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక, స్టార్ క్యాంపెయినర్ల కోసం చేసిన మొత్తం ఖర్చులో రూ. 21.41 కోట్లు ఒక్క జగన్ హెలికాప్టర్, విమానం, బస్సుల కోసమే వెచ్చించినట్టు నివేదికలో పేర్కొంది.
Admin
Studio18 News