Wednesday, 04 March 2026 08:46:16 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Bandi Sanjay: వాటికి అడ్డు చెప్పవద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది: బండి సంజయ్

Date : 08 January 2026 07:01 PM Views : 72

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదేపదే మోసం చేశారని ఆరోపణ పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని ఏపీకి తరలించారన్న బండి సంజయ్ అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాగ్యుద్ధం నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంగీకారించారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదేపదే మోసం చేశారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించినప్పుడు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాను పూర్తిగా వాడుకోలేదని, అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పవద్దని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, అయితే ఆ చట్టంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీల నీటిని తరలించారని, దీనిని తెలంగాణ కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ గతంలో పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతోందని ఆయన అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :