Saturday, 07 March 2026 08:40:46 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Tirumala Laddu Row: విజిలెన్స్ విచారణ అనగానే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు?: హోంమంత్రి అనిత

Date : 04 October 2024 03:19 PM Views : 390

Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డూ వ్యవహారం అనేది సెంటిమెంట్లతో కూడిన విషయం అని, కల్తీ జరిగిందని తెలిశాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసిందని అన్నారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాగానే, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. సరిగ్గా గమనిస్తే... తప్పు చేయని వాళ్లు భయపడరు... కానీ విజిలెన్స్ విచారణ అనగానే వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు? అని అనిత ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు నేడు ప్రస్తావించిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యమేనని... సీబీఐ అధికారులు, స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. ఇప్పుడు నిజానిజాలు తేలాలి... సిట్ దర్యాప్తుతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయి అని అనిత స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :