Thursday, 12 March 2026 12:28:22 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

HIV | తలసీమియా చికిత్సకోసం వెళ్తే హెచ్‌ఐవీ సోకింది.. రక్త మార్పిడితో ప్రమాదంలో చిన్నారుల జీవితాలు

HIV | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తలసీమియా (thalassemia)తో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులు చికిత్స కోసం వెళ్లగా.

Date : 19 December 2025 07:27 PM Views : 242

Studio18 News - జాతీయం / : HIV | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తలసీమియా (thalassemia)తో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులు చికిత్స కోసం వెళ్లగా.. వైద్యుల నిర్లక్ష్యం ఆ పిల్లలకు జీవితాన్నే లేకుండా చేసింది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆ చిన్నారులకు హెచ్‌ఐవీ (HIV) సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సత్నా (Satna)కు చెందిన కొందరు చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు వారిని సత్నాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లల్ని పరీక్షించిన వైద్యులు వారికి రక్తమార్పిడి చేశారు. 150 మందికి పైగా దాతల నుండి సేకరించిన రక్తాన్ని మూడు వేర్వేరు బ్లడ్‌ బ్యాంక్స్‌ నుంచి తీసుకొచ్చి చిన్నారులకు ఎక్కించారు. ఈ రక్తమార్పిడితో చిన్నారులకు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. రక్తం ఎక్కించిన కొన్ని రోజులకే చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారికి రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణఅయింది. రిపోర్ట్స్‌ చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ వ్యాధి లేకపోయినా.. పిల్లలకు సంక్రమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వ్యాధి సోకిన సూది వాడటంగానీ లేదంటే కలుషిత రక్తాన్ని ఎక్కించడం ద్వారాగానీ ఈ వ్యాధి సంక్రమించి ఉండవచ్చని సత్నా ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌చార్జ్‌ దేవేంద్ర పటేల్‌ తెలిపారు. తలసీమియాతో బాధ పడుతున్న ఈ ఐదుగురు పిల్లలకు అనేకసార్లు రక్తమార్పిడి చికిత్స జరిగినట్లు గుర్తించారు. ఇక ఈ ఘటనపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జ్‌, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్‌ సర్జన్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, వివరణ సంతృప్తికరంగా లేకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సత్నా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఏడాది మార్చి నెలలో తొలి హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసు నమోదైంది. మార్చి 20వ తేదీన 15 ఏళ్ల తలసీమియా పేషంట్‌కు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. మార్చి 26 నుంచి 28 వరకు మరో ఇద్దరు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన మరో కేసు నమోదు అయింది. ఇలా మొత్తం ఐదుగురు చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల జీవితాలతో వైద్యులు ఆటలాడుతున్నారంటూ మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :