Wednesday, 10 December 2025 01:27:52 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్

Date : 23 May 2025 03:18 PM Views : 251

Studio18 News - జాతీయం / : భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల మిగిలిన యూనిట్ల డెలివరీని వేగవంతం చేసే విషయమై చర్చించేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆయన రష్యా ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. మే 27 నుంచి 29 వరకు మాస్కోలో జరగనున్న భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు దోవల్ అధికారికంగా వెళుతున్నప్పటికీ, ఈ పర్యటనలో ప్రధానంగా ఎస్-400 డెలివరీల అంశంపైనే దృష్టి సారించనున్నారని పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న 'ఆపరేషన్ సిందూర్' ఘటనల నేపథ్యంలో, ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆ సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలు పాకిస్థాన్ వైమానిక దాడుల యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ శక్తివంతమైన క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారత్, రష్యాల మధ్య 2018లో సుమారు రూ.35 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. మొత్తం ఐదు ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థల కోసం ఈ ఒప్పందం జరిగింది. వీటిలో ఇప్పటికే మూడు వ్యవస్థలు భారత్‌కు చేరాయి. మిగిలిన రెండు వ్యవస్థల డెలివరీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంగా కారణంగా ఆలస్యం అయింది. షెడ్యూల్ ప్రకారం 2026 ఆగస్టు నాటికి అందజేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మరియు సరిహద్దు ఉద్రిక్తతల దృష్ట్యా, ఈ డెలివరీలను మరింత ముందుగా, అంటే వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భారత్ భావిస్తోంది. ఈ దిశగా రష్యా అధికారులతో దోవల్ చర్చలు జరిపి, వారిని ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్-400 వ్యవస్థలు శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో కూల్చివేయగలవు. అంతేకాకుండా, ప్రత్యర్థుల ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలను కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ప్రస్తుతం ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం పర్యవేక్షిస్తోంది. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని పంజాబ్, రాజస్థాన్‌లలో, చైనా నుంచి రక్షణ కోసం ఈశాన్య రాష్ట్రాల్లో (అరుణాచల్‌ ప్రదేశ్‌ లేదా అసోం) వీటిని మోహరించినట్లు సమాచారం. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ అసత్య ప్రచారం చేయగా, ప్రధాని మోదీ ఎస్-400 మోహరించిన స్థావరం నుంచి ఫొటో విడుదల చేశారు. భారత సైన్యం కూడా పాక్ ప్రచారాన్ని ఖండించి, మన రక్షణ వ్యవస్థలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉన్నాయని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, మరిన్ని ఎస్-400 వ్యవస్థలు త్వరగా చేరితే, భారత రక్షణ వలయం మరింత పటిష్టం కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :