Wednesday, 16 July 2025 11:36:59 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

PM Modi: ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ప్ర‌ధాని మోదీ ఆరా!

Date : 02 October 2024 02:16 PM Views : 120

Studio18 News - జాతీయం / : ద‌క్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దాంట్లో స్టెంట్ అమర్చినట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. ఇక సూప‌ర్ స్టార్ ఆసుప‌త్రిలో చేర‌డంపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న ఆరోగ్యంపై స్పందించారు. ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ర‌జ‌నీ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న భార్య ల‌తా ర‌జ‌నీకాంత్‌కి ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్లు త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లై తెలిపారు. ఈ మేర‌కు అన్నామ‌లై ఓ ట్వీట్ చేశారు. "సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి పీఎం మోదీ ఈరోజు లతా రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చికిత్స జ‌రిగిన తర్వాత ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగారు. త‌లైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు" అని అన్నామ‌లై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీతో క‌లిసి ఉన్న రజనీకాంత్ ఫొటోను ఆయ‌న జోడించారు. ఇక అంత‌కుముందు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, మ‌రో స్టార్‌ న‌టుడు విజ‌య్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సూప‌ర్ స్టార్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ల‌తా ర‌జ‌నీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :