Wednesday, 25 June 2025 06:23:15 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Supreme Court: రోడ్లపై ఉన్న ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు

Date : 01 October 2024 03:22 PM Views : 111

Studio18 News - జాతీయం / : ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు.. ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. ఈమేరకు బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదీ కేసు... ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందనే ఆరోపణలు ఇటీవల పెరిగాయి. అత్యాచారం, హత్య కేసులలో నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపిస్తోందని పలు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేరం జరిగిన ఒకటి రెండు రోజుల్లో పలు కారణాలు చూపిస్తూ నిందితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది 'బుల్డోజర్ జస్టిస్' అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. దీనిని కోర్టులు ఆక్షేపించాయి. ఒకవేళ నిందితుడు నేరానికి పాల్పడినా సరే ఇంటిని కూల్చడం సరికాదని వ్యాఖ్యానించాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బుల్డోజర్ జస్టిస్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారించారు. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలని తేల్చాక నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒక ఘటననో, ఓ వర్గం వారి ఆరోపణలతోనో కూల్చివేతలు అక్రమమని భావించవద్దని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం బెంచ్... మనది లౌకిక దేశమని గుర్తుచేస్తూ మత విశ్వాసాలకన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు తెలిపింది. రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాలను తొలగింపును కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. నిందితుల ఇళ్ల కూల్చివేత విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఆక్రమణల తొలగింపు చట్టప్రకారమే జరగాలన్నదే ధర్మాసనం అభిప్రాయమని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :