Studio18 News - జాతీయం / : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద ఘనంగా నిర్వహించారు. జనసైనికులు, అభిమానులు అశేషంగా విచ్చేసిన ఈ సభలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జనసేనాని పవన్ ప్రసంగ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ్ముడు పవన్ ప్రసంగాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రసంగంపై ఆయన స్పందించారు. జనసేన జయకేతన సభలో పవన్ స్పీచ్‌కి మంత్రముగ్దుడినయ్యానని అన్నారు. సభకు వచ్చిన అశేష జన సంద్రంలానే తన మనసు ఉప్పొంగిందని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్పూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ఆశీర్వదిస్తూ .. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Studio18 News