Thursday, 12 March 2026 04:15:02 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

దేశంలో 3 వేలకు చేరువైన కొవిడ్ కేసులు

Date : 31 May 2025 12:33 PM Views : 323

Studio18 News - జాతీయం / : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లలో 3 చొప్పున, మిజోరాం, అసోంలలో రెండేసి గుర్తించారు. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నెలలో ఏడుగురు మృతి.. ఈ నెలలో కరోనా మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఇద్దరు మరణించగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరణించిన వారిలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి మినహా మిగిలిన వారందరూ వయోవృద్ధులని, వారు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని అధికారులు వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :