Saturday, 17 January 2026 10:29:44 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

భారత్-పాక్ ఉద్రిక్తత... బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన జైశంకర్

Date : 09 May 2025 03:53 PM Views : 312

Studio18 News - జాతీయం / : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇవాళ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడరాదని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "ఈ మధ్యాహ్నం యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఫోన్‌లో మాట్లాడాను. ఉగ్రవాద నిర్మూలనపై మేం చర్చించాం. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అంశంపై ఆయనతో చర్చించాను" అని జైశంకర్ తన పోస్టులో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ దాడికి ప్రతిగా, భారత సాయుధ దళాలు మే 7వ తేదీన పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్దిష్ట దాడులు చేపట్టాయి. 'ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సమన్వయంతో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలతో పాటు పీఓకేలోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఆ తర్వాత పాకిస్థాన్ సాయుధ దళాలు ఎల్ఓసీ వెంబడి డ్రోన్లు, ఇతర ఆయధాలతో దాడులకు పాల్పడ్డాయి. పాక్ చర్యలకు భారత్ దీటుగా స్పందిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :