Sunday, 08 March 2026 09:56:30 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

మావోయిస్టులకు భారీ షాక్... 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం

Date : 02 June 2025 06:16 PM Views : 336

Studio18 News - జాతీయం / : ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారు 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ భారీ ఆపరేషన్‌లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఝార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు, మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు, చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరూ తారసపడలేదు. దీనితో ఎటువంటి ఎదురుకాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రత నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :