Monday, 23 June 2025 02:37:01 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

ఆర్బీఐకి రష్యా భాషలో బాంబు బెదిరింపు.. నెలలో రెండోసారి

ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు రష్యన్ భాషలో ఈమెయిల్ బాంబులతో ఆర్బీఐ భవనాన్ని పేల్చివేయబోతున్నట్టు బెదిరింపు గత నెల 16న కూడా బాంబు బెదిరింపు అందుకున్న ఆర

Date : 13 December 2024 11:55 AM Views : 216

Studio18 News - జాతీయం / : దేశంలో బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతున్నాయి. గత నెలలో విమానయాన సంస్థలకు వందలాది బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లు, ఇతర సంస్థలకు అయితే లెక్కేలేదు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. ఆ తర్వాత సద్దుమణిగిన ఈ వ్యవహారం మళ్లీ మొదలైంది. తాజాగా, భారతీయ రిజర్వు బ్యాంకుకు రష్యన్ భాషలో బాంబు బెదిరింపు వచ్చింది. ముంబైలోని ఆర్బీఐ భవనాన్ని బాంబులతో పేల్చి వేయబోతున్నట్టు చెబుతూ నిన్న మధ్యాహ్నం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు రష్యన్ భాషలో ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్బీఐకి నెల రోజుల్లో ఇది రెండో బాంబు బెదిరింపు. గత నెల 16న ఆర్బీఐ కస్టమర్ కేర్‌కు ఇలాంటి బెదిరింపే వచ్చింది. తాను లష్కరే తాయిబా సీఈవోనని చెబుతూ కాలర్ ఈ బెదిరింపునకు పాల్పడ్డాడు. తాజా బెదిరింపు నేపథ్యంలో ఆర్బీఐ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

Also Read : మీడియా ప్ర‌తినిధిపై దాడి ఘ‌ట‌న‌.. లిఖిత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మోహ‌న్ బాబు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :