Saturday, 24 January 2026 08:39:46 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

అధికారికంగా బిచ్చగాళ్లయ్యారు... పాక్‌ పై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

Date : 10 May 2025 06:36 PM Views : 338

Studio18 News - జాతీయం / : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి, భారత్‌పై దాని దుందుడుకు చర్యల నేపథ్యంలో ఒవైసీ శనివారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, "పాకిస్థాన్ ఇప్పుడు అధికారికంగా ఒక బిచ్చగాడి దేశంగా మారింది" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్ ఒక బిలియన్ డాలర్ల రుణం కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. "గత 75 ఏళ్లుగా ఏం చేశారు, ఈ దుస్థితికి రావడానికి కారణం ఎవరు? అయినా దురదృష్టవశాత్తూ ఐఎంఎఫ్ వారికి రుణం ఇస్తోంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి కాదు, అంతర్జాతీయ మిలిటెంట్ ఫండ్" అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మన భూభాగం, మన సైనికులు, మన ప్రజలపై దాడులు జరుగుతున్నా అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు దీనికి ఎలా అంగీకరిస్తున్నాయి?" అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ అంతర్గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ, "దేశాన్ని పాలించడం చేతకాదు, ఆర్థిక వ్యవస్థను నడపడం తెలియదు. ఇస్లాం గురించి మాట్లాడటం తప్ప వాళ్ల దగ్గర ఏమీ లేదు. భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే ఈ వ్యూహాలు పన్నుతున్నారు" అని విమర్శించారు. శత్రువుల దాడులను మన సైనికులు ధైర్యంగా తిప్పికొడుతున్నారని ప్రశంసించిన ఒవైసీ, "శ్రీనగర్‌ వరకు డ్రోన్లు వస్తున్నాయి. మన సైనికులు ఎంత ధైర్యంతో వాటిని ఎదుర్కొంటున్నారో ఊహించలేం. సరిహద్దు ప్రజలు కూడా ధైర్యంగా నిలబడుతున్నారు" అని అన్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కనపెట్టి దేశం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ అణు సామర్థ్యం ప్రపంచానికి ప్రమాదకరమని, దాన్ని నిరాయుధీకరించాలని ప్రపంచ దేశాలను కోరారు. "ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలపై దాడి చేసేంత నీచస్థాయికి దిగజారారు. చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి ధైర్యంగా, ఐక్యంగా స్పందించాలి. వారి పతనం ఎంతో దూరంలో లేదు" అని ఒవైసీ పేర్కొన్నారు. దేశ సైన్యానికి అండగా నిలవాలని జాతీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :