Saturday, 07 March 2026 08:41:23 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Anushka Shetty: 'ఘాటి' హైలైట్స్ ఇవేనా?

Date : 04 September 2025 06:33 PM Views : 430

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రేపు విడుదలవుతున్న 'ఘాటి' కొత్త లుక్ తో కనిపించనున్న అనుష్క పవర్ఫుల్ పాత్రలో అనుష్క విశ్వరూపం డైలాగ్స్ - లొకేషన్స్ హైలైట్ కొత్త రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్ అనుష్క ప్రధానమైన పాత్రగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఘాటి' సిద్ధమవుతోంది. రేపు భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆరంభం నుంచే అంచనాలు పెంచుతూ వెళుతోంది. అందుకు ప్రధానమైన కారణం అనుష్క. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈ సినిమా చేస్తుండటంతో అందరిలోను ఆసక్తిని పెంచుతోంది. కథలో బలమైన అంశమేదో ఉండటం వల్లనే ఆమె అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు. 'అరుంధతి' తరువాత అనుష్క నాయిక ప్రధానమైన సినిమాలు చేసింది. అయితే ఆ సినిమా స్థాయిలో అనుష్క మిగతా సినిమాలలో అంత పవర్ఫుల్ గా కనిపించలేదు. హారర్ .. సస్పెన్స్ .. కామెడీ టచ్ తోనే ఆ సినిమాలు సాగాయి. అందువలన 'అరుంధతి' వంటి ఒక గంభీరమైన పాత్రలో ఆమెను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి ఈ సమయంలోనే ఆమె 'ఘాటి' సినిమాను చేసింది. పోస్టర్స్ నుంచే అభిమానులను ఖుషీ చేసిన సినిమా ఇది. 'ఘాటి' అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 'ఘాటి' అని ఎవరిని అంటారనేది క్రిష్ క్లారిటీ ఇచ్చిన తరువాత మరింత కనెక్ట్ అయింది. అనుష్క డిఫరెంట్ లుక్ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా కనిపించడం .. అందుకు తగిన డైలాగ్ డెలివరీ .. యాక్షన్ సీన్స్ .. లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. చాలా కాలం తరువాత అనుష్కను తాము అనుకున్నటు వంటి పాత్రలో చూడబోతున్నందుకు అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొడుతుందేమో చూడాలి మరి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :