Wednesday, 17 December 2025 03:04:14 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Dil Raju: సల్మాన్ ఖాన్ తో దిల్ రాజు భారీ సినిమా... డైరెక్టర్ ఎవరంటే..!

Date : 13 October 2025 06:32 PM Views : 105

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దర్శకత్వం వహించనున్న టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పటికే కథకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్న బాలీవుడ్ వర్గాలు గేమ్ ఛేంజర్, తమ్ముడు సినిమాలతో దిల్ రాజుకు భారీ నష్టాలు టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ ప్రాజెక్టుతో తిరిగి పుంజుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమిళ స్టార్ విజయ్ తో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :