Sunday, 08 February 2026 10:27:33 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Salman Khan: రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ స‌ల్మాన్‌కు బెదిరింపులు.. కూరగాయల వ్యాపారి అరెస్ట్‌!

Date : 24 October 2024 02:15 PM Views : 318

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలలోకి వెళితే, ఈ నెల‌ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ బెదిరింపు సందేశం వ‌చ్చింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి సందేశం రావ‌డంతో కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో జంషెడ్‌పూర్‌లోని స్థానిక పోలీసుల సహాయంతో బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ వ్యక్తిని ట్రాక్ చేసి అరెస్టు చేశామ‌న్నారు. తదుపరి విచారణ కోసం అతన్ని ముంబ‌యికి తీసుకువస్తామ‌ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక తాను అడిగిన సొమ్ము చెల్లించకపోతే సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు త‌ప్ప‌ద‌ని స‌ద‌రు వ్య‌క్తి త‌న‌ బెదిరింపు సందేశంలో పేర్కొన్నాడు. "దీనిని తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ సజీవంగా ఉండి, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వాన్ని ముగించాలనుకుంటే రూ. 5 కోట్లు చెల్లించాలి. ఒక‌వేళ డబ్బు ఇవ్వకపోతే, సల్మాన్ ఖాన్ పరిస్థితి మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిక్ (ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన వ్య‌క్తి) కంటే మరింత దారుణంగా ఉంటుంది అని సందేశం పంపాడు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతుండ‌గానే ఈ నెల 21న అదే వ్యక్తి మళ్లీ పోలీసులకు మ‌రో సందేశం పంపించాడు. ఇంత‌కుముందు పంపిన‌ సందేశానికి క్షమాపణలు కోరాడు. పొరపాటున దాన్ని పంపినట్లు పేర్కొన్నాడు. అయితే, ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత‌ బాబా సిద్ధిక్ హత్య నేపథ్యంలో అధికారులు ఆ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్నారు. దాంతో స‌ల్లూభాయ్‌కు భద్రతను పెంచారు. అలాగే ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి, జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రేత‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కృష్ణ‌జింక‌ల‌ను వేటాడిన కేసు నేప‌థ్యంలో ఇప్ప‌టికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ ఖాన్‌కు ప‌లుమార్లు హత్య బెదిరింపులు వ‌చ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో స‌ల్మాన్‌ బాంద్రా ఇంటి వెలుపల బిష్ణోయ్ ముఠాలోని అనుమానిత సభ్యులు కాల్పుల‌కు కూడా పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో కొన్ని నెలల క్రితం నవీ ముంబ‌యి పోలీసులు కండ‌ల‌వీరుడిని చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన కుట్ర‌ను కూడా బయటపెట్టారు. అప్ప‌టి నుంచి స‌ల్లూ భాయ్‌కు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :