Monday, 08 December 2025 04:43:51 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

18 ఏళ్ల తర్వాత మళ్లీ రమణ గోగుల!

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ రమణ గోగులతో పాడిస్తున్నామన్న చిత్రబృందం 2006లో లక్ష

Date : 14 November 2024 02:25 PM Views : 305

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : విక్టరీ వెంకటేశ్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో అప్ డేట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా, గీత రచయిత భాస్కరభట్ల కనిపిస్తారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశామని, అయితే రెగ్యులర్ సింగర్లతో కాకుండా, ప్రత్యేకమైన గాత్రం కలిగిన సింగర్ (రమణ గోగుల)తో పాడిస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి చెప్పగా... ఆయన వస్తాడా? అని భీమ్స్ సందేహం వ్యక్తం చేయగా.... వెంటపడితే వస్తాడు అని అనిల్ రావిపూడి బదులిచ్చాడు. వెంటనే భీమ్స్ సిసిరోలియో తన ఫోన్ నుంచి వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులకు ఫోన్ చేయడం, రమణ గోగుల కార్లో రికార్డింగ్ స్టూడియోకు రావడం ఈ వీడియోలో చూడొచ్చు. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలోని ఆ స్పెషల్ సాంగ్ ను రమణ గోగుల ఆలపించినట్టు కూడా చిత్రబృందం తమ వీడియోలో చూపించింది. రమణ గోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, లక్ష్మీ, అన్నవరం, యోగి వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇక, వెంకటేశ్ తో రమణగోగుల చేసిన 'లక్ష్మీ' చిత్రం కూడా మ్యూజికల్ హిట్టయింది. ఈ చిత్రం 2006లో వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు, అంటే 18 ఏళ్ల తర్వాత వెంకీ మామా, రమణ గోగుల ఓ చిత్రానికి పనిచేస్తున్నారు. దీని గురించి చిత్రబృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ ట్యూన్ ఇచ్చాడని, ఈ స్పెషల్ సాంగ్ ను వెరీ స్పెషల్ సింగర్ రమణ గోగుల ఆలపిస్తున్నాడని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన ట్వీట్ లో వెల్లడించింది. త్వరలోనే తమ చిత్రం నుంచి మొదటి సింగిల్ రిలీజ్ కానుందని తెలిపింది. రమణ గోగుల మంచి మ్యూజిక్ డైరెక్టరే కాదు, మంచి సింగర్ కూడా. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు ఆయన పాడిన పాటలు అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి.

Also Read : సీసీ కెమెరాల్లో హైదరాబాద్​ రికార్డ్​... ఎంత మందికి ఎన్ని కెమెరాలంటే!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :