Monday, 08 December 2025 03:29:03 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన లాయర్ అరెస్ట్

చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు గతవారం బాంద్రా పోలీసులకు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వకుంటే షారూఖ్‌ను చంపేస్తానని హెచ్చరిక ఆ

Date : 12 November 2024 11:35 AM Views : 188

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన చత్తీస్‌గఢ్ న్యాయవాది ఫైజాన్‌ఖాన్‌ను ముంబై పోలీసులు ఈ రోజు (మంగళవారం) అరెస్ట్ చేశారు. తనకు రూ. 50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానని షారూఖ్‌ను ఫైజాన్ బెదిరించారు. రాయపూర్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫైజాన్ ఇటీవల మాట్లాడుతూ ఈ నెల 14న తాను ముంబై వచ్చి బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. అయితే, గత రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాస్తూ తన వాంగ్మూలాన్ని వర్చువల్‌గా తీసుకోవాలని కోరారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపుల నేపథ్యంలో షారూఖ్‌కు కూడా బెదిరింపులు రావడం కలకలం రేపింది. షారూఖ్ తనకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానంటూ గతవారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైజాన్‌ఖాన్ పేరుతో రిజస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసు బృందం రాయ్‌పూర్ వెళ్లి ఫైజాన్‌కు సమన్లు ఇచ్చింది. అయితే, ఆ బెదిరింపు కాల్‌కు, తనకు సంబంధం లేదని, ఈ నెల 2నే తాను ఫోన్ పోగొట్టుకున్నానని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. తన నంబర్ నుంచి బెదిరింపు కాల్ చేయడం వెనక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కారణమయ్యారంటూ షారూఖ్‌పై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. షారూఖ్‌కు బెదిరింపుల కేసులో తనను ఇరికించారని ఆరోపించారు.

Also Read : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ అలర్ట్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :