Thursday, 12 March 2026 03:30:32 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Rithika Nayak: 'మిరాయ్'లో మెరిసిన పాలరాతి శిల్పం!

Date : 13 September 2025 06:39 PM Views : 443

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిన్న విడుదలైన 'మిరాయ్' తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్ అందంగా మెరిసిన రితిక నాయక్ అభిమానులుగా చేరిపోతున్న కుర్రాళ్లు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయమే వెండితెరపై పూల తోటలు .. మంచుకొండలు .. వెన్నెల్లో తడిసే వనాలు కనిపించకపోయినా ఆడియన్స్ పెద్దగా బోర్ ఫీలవ్వరు. పాలనురగలతో దూకే జలపాతాలు .. గలగలమని ప్రవహించే సెలయేళ్లు పలకరించకపోయినా పట్టించుకోరు. తెరపై విందుభోజనాల వడ్డన జరుగుతున్నా లైట్ తీసుకుంటారు. అందమైన హీరోయిన్ ను తప్ప, వాళ్ల చూపులు మరి దేని కోసమూ వెదకవు. తెరపై అందమైన హీరోయిన్ చూపించే ప్రభావం ఆ రేంజ్ లో ఉంటుంది మరి.

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తుంది. ఆ తరువాత అంత ఆకర్షణీయంగా అనిపించిన నాయిక ఎవరైనా ఉన్నారా అంటే, 'రితిక నాయక్' అనే చెప్పాలి. 'మిరాయ్' సినిమా చూసిన కుర్రాళ్లంతా తమ హృదయాలను ఆమెకి అప్పగించేసి వచ్చేశారు. పాలరాతి శిల్పం మాదిరిగా ఉన్న ఈ అమ్మాయి ఎవరబ్బా అనే చర్చలు చేసుకుంటూ కనిపించారు. తాను ఇంతకుముందు 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో చేసిందనే విషయం కొంతమందికి తట్టింది. \\ఎలాంటి అలంకరణలు లేకపోయినా చూపు తిప్పుకోనీయనిదే అసలైన అందం అంటూ ఉంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అలాగే కనిపిస్తుంది. భుజాన ఒక సంచీ తగిలించుకుని తిరిగే సాధువు ఆమె. కానీ తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి, ఆ పక్కన ఎవరున్నారనేది ఆడియన్స్ పట్టించుకోలేదు. వెన్నెల్లోని చందమామకు వెన్నతో కనుముక్కు తీర్చినట్టుగా కనిపించడం గురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే ఈ బ్యూటీని మరిన్ని ఛాన్సులు పలకరించే సూచనలు కనిపిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :