Saturday, 24 January 2026 03:14:53 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Viral Video: న్యూయార్క్ వీధుల్లో కావ్య మారన్, అనిరుధ్.. మళ్లీ పెళ్లి వార్తలు!

Date : 13 November 2025 06:50 PM Views : 180

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అనిరుధ్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ మళ్లీ వార్తలు న్యూయార్క్ వీధుల్లో కలిసి కనిపించడంతో ఊహాగానాలకు బలం ఓ అమెరికన్ యూట్యూబర్ వీడియోలో అనుకోకుండా రికార్డ్ వచ్చే ఏడాదే పెళ్లి అంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం కేవలం స్నేహితులు మాత్రమేనంటున్న అనిరుధ్ టీమ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న పుకార్లకు మళ్లీ బలం చేకూరింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ, తాజాగా న్యూయార్క్‌లో కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఓ అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనిరుధ్, కావ్య మారన్ అనుకోకుండా కెమెరా కంట పడ్డారు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీక్రెట్ లవర్స్ దొరికేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చ జోరందుకుంది. వచ్చే ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతోందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే ఇది జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుధ్ టీమ్ స్పందించింది. వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనిరుధ్ దక్షిణాదిలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధనుశ్‌ 'త్రీ' సినిమాతో కెరీర్ ప్రారంభించి, అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. ఒక్కో సినిమాకు సుమారు రూ. 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో విజయ్ ‘జననాయగ‌న్’, లోకేశ్‌ కనగరాజ్ ‘డీసీ’ వంటి తమిళ చిత్రాలతో పాటు తెలుగులో నాని ‘ది ప్యారడైజ్’, ఎన్టీఆర్ ‘దేవర 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు కావ్య మారన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ యజమానురాలిగా, ఛైర్మన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతుంటాయి. తాజా వీడియోతో మరోసారి వీరి రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారడంతో ఈ పెళ్లి వార్తలపై ఈసారైనా వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తారేమో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :