Thursday, 12 March 2026 01:00:25 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Trivikram: వెంకటేశ్ గారి శ్రీమతి చెప్పిన మాటే నిజమైంది: త్రివిక్రమ్

Date : 31 December 2025 06:51 PM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 2001లో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' వెంకటేశ్ సరసన సందడి చేసిన ఆర్తి అగర్వాల్ అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సినిమా ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్న త్రివిక్రమ్ - రవికిశోర్ రేపు రీ రిలీజ్ అవుతున్న సినిమా వెంకటేశ్ - ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. త్రివిక్రమ్ కథ - మాటలు అందించిన ఈ సినిమాకి, విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2001 సెప్టెంబర్ 6వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను జనవరి 1వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించిన విషయాలను నిర్మాత స్రవంతి రవికిశోర్ - త్రివిక్రమ్ ముచ్చటించుకున్నారు. " సిరివెన్నెల గారు రాసిన పాటలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అన్ని పాటలు ఆయన రాస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలా ఎక్కువ రోజులు పాటు ఆయనకి సన్నిహితంగా ఉండే అవకాశం నాకు లభించింది. తనకి డబ్బులు వస్తున్నాయి గదా అని సిరివెన్నెల ఎలా అంటే అలా పాటలు రాసేవారు కాదు. ఏదైనా ఒక సందర్భంలో అక్కడ పాట ఇమడదు అనిపిస్తే ఆ విషయాన్ని వెంటనే చెప్పేసేవారు. కథను పాటలో అందంగా చెప్పడం నిజంగా ఆయన గొప్పతనమే" అంటూ ఆయన సిరివెన్నెలను తలచుకున్నారు. ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రివ్యూను రామానాయుడిగారి ఫ్యామిలీ కోసం వేశాము. అప్పుడు మీరు .. నేను .. విజయ్ భాస్కర్ గారు కూడా ఉన్నాము. సినిమా చూసిన తరువాత వెంకటేశ్ గారి శ్రీమతి ఒక మాట చెప్పారు. 'ఇప్పుడు మనమందరం కూడా ఎప్పుడు మనసు బాగో లేకపోయినా ఎలా 'గుండమ్మ కథ'ను చూస్తున్నామో, నెక్స్ట్ జనరేషన్ వాళ్లు కూడా మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారు' అని అన్నారు. ఇప్పుడు అందరూ ఆ మాటనే అంటూ ఉంటే, వెంకటేశ్ గారి శ్రీమతి ఆ రోజున చెప్పిన మాటలే నాకు గుర్తుకు వస్తుంటాయి" అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :