Monday, 19 January 2026 08:44:57 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Rajamouli: పాసులు ఉన్నవారే రండి.. 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు వారికి నో ఎంట్రీ: రాజమౌళి

Date : 13 November 2025 06:36 PM Views : 107

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్‌పై దర్శకుడు రాజమౌళి కీలక ప్రకటన ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, ఫిజికల్ పాసులు తప్పనిసరని స్పష్టీకరణ ఆన్‌లైన్‌లో పాసులు అమ్ముతున్నారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన భద్రతా కారణాల వల్ల 18 ఏళ్లలోపు, వృద్ధులకు అనుమతి లేదని వెల్లడి భారీ బందోబస్తు మధ్య ఈవెంట్, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి పాసులపై ఉన్న క్యూఆర్ కోడ్‌తో రూట్ మ్యాప్ తెలుసుకోవాలని సలహా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈవెంట్ విజయవంతం కావాలంటే అభిమానుల సహకారం ఎంతో అవసరమని రాజమౌళి పేర్కొన్నారు. "ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతీ ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు. దయచేసి అందరూ సహకరించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి" అని ఆయన స్ప‌ష్టం చేశారు. కొందరు ఆన్‌లైన్‌లో పాసులు విక్రయిస్తున్నారని, ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని రాజమౌళి తెలిపారు. ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా ఆయన వివరించారు. "మీ పాసులపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి" అని తెలిపారు. దారిపొడవునా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇది మనందరి భద్రత కోసమేనని రాజమౌళి అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా 18 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారని, కాబట్టి వారు ఇళ్ల వద్ద నుంచే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి జరగనున్న ఈ ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఒకేచోట హాజరుకానుండటంతో భారత సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, స్క్రీన్ (100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు) ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తుండటం విశేషం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :