Sunday, 08 March 2026 03:47:41 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసు.. లీకైన ఆడియో

Date : 26 September 2024 12:20 PM Views : 579

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లొంగదీసుకోవడంతో పాటు రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. దీనిపై మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై హర్షసాయి ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సదరు యువతి డబ్బుల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని, తనేమిటో తన అభిమానులకు తెలుసని చెప్పాడు. త్వరలోనే నిజం బయటపడుతుందని, ఈ విషయంలో ఇకపై తన లాయర్ మాట్లాడతారని వీడియోలో చెప్పాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధిత యువతికి, హర్షసాయికి మధ్య జరిగిన పలు ఫోన్ కాల్స్ రికార్డులు లీక్ అయ్యాయి. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు కాల్స్ కు సంబంధించిన ఆడియోలు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఒకదాంట్లో బాధిత యువతి, హర్షసాయి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ గట్టిగా వాదించుకోవడం వినిపిస్తోంది. మరో ఆడియోలో బాధిత యువతి హర్షసాయితో క్లోజ్ గా మాట్లాడగా.. హర్షసాయి ‘ఊ ఆ’ అంటూ సరిపెట్టడం వినిపించింది. ఈ ఆడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు కోరారని సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :