Thursday, 12 March 2026 01:21:53 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sivaji: నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

Date : 23 December 2025 06:18 PM Views : 93

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : చిక్కుల్లో పడిన నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో శివాజీపై వెల్లువెత్తిన విమర్శలు రంగంలోకి దిగిన తెలంగాణ మహిళా కమిషన్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ప్రముఖ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చీర కట్టుకుంటేనే అందం కానీ, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం కాదు. అలాంటి వాళ్లను చూస్తే దరిద్రపు ముండ అని తిట్టాలనిపిస్తుంది... పైకి ఎవరూ అనకపోయినా లోపల మాత్రం తిట్టుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను తమ లీగల్ టీమ్ పరిశీలించిందని, ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు నటులు జాగ్రత్తగా ఉండాలని, మహిళలను అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద సహా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల దుస్తుల ఎంపికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి స్వేచ్ఛను హరించడమేనని, ఇది తిరోగమన ధోరణిని సూచిస్తుందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. మహిళా కమిషన్ నోటీసుల నేపథ్యంలో శివాజీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :