Thursday, 12 March 2026 01:08:00 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Niharika Konidela: నిర్మాతగా నిహారిక మరో ప్రయత్నం... ఏప్రిల్ 3న వస్తున్న 'రాకాస'

Date : 06 February 2026 06:48 PM Views : 35

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న 'రాకాస' ఏప్రిల్ 3న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటన నిర్మాతగా నిహారిక కొణిదెల మరో విభిన్న చిత్రం ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన ఆసక్తిని పెంచుతున్న కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ యువ నటుడు సంగీత్ శోభన్ సోలో హీరోగా పరిచయమవుతున్న కొత్త చిత్రం ‘రాకాస’. నటి, నిర్మాత నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘రాకాస’ సినిమాను ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో సంగీత్ శోభన్ చీకటిలో చేతిలో కాగడా పట్టుకుని సీరియస్‌గా ఏదో వెతుకుతున్నట్లు కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విభిన్న కథాంశంతో తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మానస శర్మ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ఈ సినిమాలో సోలో హీరోగా ఎలా మెప్పిస్తాడనే దానిపై అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఉమేశ్ కుమార్ బన్సాల్ ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :