Thursday, 12 March 2026 12:33:19 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్!

Date : 22 January 2026 08:00 PM Views : 156

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డిసెంబర్ 25న విడుదలైన 'శంబాల' ఆది సాయికుమార్ కి హిట్ తెచ్చిన సినిమా విలేజ్ నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా 'శంబాల'. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా, టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, డిసెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. 12 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 20 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 14 కోట్లకి పైకి నెట్ ను వసూలు చేసింది. చాలా గ్యాప్ తరువాత ఆదిసాయికుమార్ సాధించిన హిట్ సినిమాగా ఇది నిలిచింది. అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ వైపు నుంచి కన్నా ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందనే అభిప్రాయాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా, ఈ రోజునే 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఆది సాయికుమార్ తో పాటు అర్చన అయ్యర్ .. శ్వాసిక .. మధునందన్ .. రవివర్మ .. రామరాజు .. సిజూ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు. కథ విషయానికి వస్తే .. 'శంబాల' అనే ఒక మారుమూల పల్లెలో ఒక 'ఉల్క' పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ ఉల్కను అందరూ కూడా 'బండభూతం' అని పిలుస్తుంటారు. అక్కడి మూఢనమ్మకాలను తరిమికొట్టడం కోసం విక్రమ్ వస్తాడు. ఆ ఊళ్లో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? జరుగుతున్న సంఘటనలకు కారకులు ఎవరు? అనేది కథ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :