Sunday, 08 February 2026 11:29:48 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Rajinikanth: రాజకీయ ప్రశ్న వేసిన విలేకరిపై రజనీకాంత్‌ అసహనం !

Date : 20 September 2024 01:18 PM Views : 299

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. గతంలో ఈయన రాజకీయ రంగ ప్రవేశం వుంటుందని అందరూ ఊహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టయాన్‌ చిత్రంతో పాటు లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న కూలీ చిత్రంలోనూ నటిస్తున్నారు. కేవలం సినిమాలు, ఆరోగ్యంపై దృష్టి సారించిన రజనీకాంత్‌ తాజాగా రాజకీయాలపై ఎదురైన ఓ ప్రశ్నకు విలేకరిపై మండిపడ్డాడు. ఇటీవల చెన్నయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయ్‌నిధి స్టాలిన్‌ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో వుంది.. దీనిపై మీ కామెంట్‌ ఏమిటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'పాలిటిక్ప్‌కు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీకు ఇంతకు ముందే చెప్పానుగా' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రజనీకాంత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో తిరుగుతోంది. డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ విషయంపై ఉదయనిధి స్టాలిన్‌ కూడా 'ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం, దీనిపై ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు' అని స్పందించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌ తమిళనాడు ప్రభుత్వంలో యూత్‌ వెల్పేర్‌, స్పోర్స్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌గా, డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :