Wednesday, 17 December 2025 02:39:47 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Sujeeth: పుకార్లకు ఫుల్‌స్టాప్.. నిర్మాతపై ‘ఓజీ’ దర్శకుడి ప్రశంసల వర్షం

Date : 21 October 2025 06:57 PM Views : 152

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిర్మాత డీవీవీ దానయ్యపై దర్శకుడు సుజీత్ ప్రశంసలు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ ఇద్దరి మధ్య విభేదాలు అంటూ వస్తున్న పుకార్లు రూమర్లకు చెక్ పెట్టేందుకే ఈ పోస్ట్ అని నెట్టింట చర్చ ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని చెబుతూ, నిర్మాత దానయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఓజీ సినిమా గురించి బయట చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభం నుంచి ముగింపు వరకు నడిపించడానికి ఏం అవసరమో కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఆ విషయంలో నన్ను నమ్మి, నాకు అండగా నిలిచిన నా నిర్మాత దానయ్య గారికి, నా టీమ్‌కు మాటల్లో చెప్పలేనంతగా రుణపడి ఉంటాను’’ అని సుజీత్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, సుజీత్ ఉన్నట్టుండి ఈ పోస్ట్ పెట్టడం వెనుక బలమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, సుజీత్ తన తదుపరి చిత్రాన్ని హీరో నానితో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైంది. ఈ అనూహ్య మార్పుతోనే సుజీత్‌కు, దానయ్యకు మధ్య దూరం పెరిగిందని, అందుకే నిర్మాణ సంస్థ మారిందనే పుకార్లు షికారు చేశాయి. ఈ రూమర్లకు బలం చేకూర్చేలా ‘ఓజీ’ నిర్మాణ సమయంలోనూ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే, తన నిర్మాతతో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసేందుకే సుజీత్ ఈ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :