Sunday, 08 February 2026 01:36:13 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Srikanth Bharat: గాంధీపై అనుచిత వ్యాఖ్యలు: నటుడు శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదు

Date : 11 October 2025 06:59 PM Views : 224

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : శ్రీకాంత్‌పై సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు శ్రీకాంత్ భరత్ 'మా' సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాలని కోరిన బల్మూర్ వెంకట్ జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, సదరు నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, శ్రీకాంత్ భరత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెంకట్ బల్మూరి మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్ర్యం పేరుతో కొందరు హద్దులు మీరుతున్నారని మండిపడ్డారు. గాడ్సే వారసులమని చెప్పుకునే వారే గాంధీజీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాంత్ భరత్ చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి, శ్రీకాంత్ భరత్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరతామని వెంకట్ బల్మూరి తెలిపారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ భరత్‌పై ఫిర్యాదులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :