Sunday, 25 January 2026 05:19:01 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

Date : 02 June 2025 11:55 AM Views : 326

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. చాలా కాలం తర్వాత ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పెళ్లి గురించి ఓ తీపి కబురు చెప్పారు. తాను హీరోయిన్ సిరితో తన పెళ్లి అక్టోబర్ లో జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నారా రోహిత్, సిరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. వాస్తవానికి, వీరి వివాహం గత డిసెంబర్‌లోనే జరగాల్సి ఉండగా, అనుకోని విషాదం చోటుచేసుకుంది. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో పెళ్లి వాయిదా పడింది. ఈ విషయంపై ‘భైరవం’ చిత్ర విజయోత్సవ సభలో స్పందించిన నారా రోహిత్, "మా నాన్నగారు రామ్మూర్తి నాయుడుగారి సంవత్సరికం పూర్తయిన తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. దీంతో అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిరి విషయానికొస్తే... ఆమె తెలుగు అమ్మాయి. స్వస్థలం రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. నారా రోహిత్, సిరి కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు ఒక్కటి కాబోతున్నారు. సిరి ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :