Wednesday, 17 December 2025 03:35:33 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Rahul Ravindran | సమంతను తీసుకుంటున్నానని పుకార్లు వచ్చాయి.. ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీపై డైరెక్టర్‌ రాహుల్ రవీంద్రన్‌

Rahul Ravindran | అల్లు అరవింద్‌ ది గర్ల్‌ ఫ్రెండ్‌ స్టోరీ విన్నప్పుడు ఈ కథను ఓటీటీ కంటే థియేటర్లలో చూపించడం బెటరన్నారని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చా

Date : 30 October 2025 07:50 PM Views : 152

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rahul Ravindran | టాలీవుడ్‌లో యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అతికొద్ది సెలబ్రిటీల్లో ఒకరు రాహుల్ రవీంద్రన్‌. ప్రస్తుతం నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నాతో ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్‌ . దీక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఈ సందర్భంగా చేసిన చిట్‌చాట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు రాహుల్ రవీంద్రన్‌. తన కాలేజ్‌ రోజుల్లో ఎదుర్కొన్న ఒక అనుభవం ఆధారంగా కథ రాశానన్నాడు రాహుల్ రవీంద్రన్‌. ఆ సమయంలో నాకు వినిపించిన ఓ పాట కూడా ఈ కథ రాయడానికి స్పూర్తిని కలిగించింది. ఖాళీగా ఉన్న టైంలో కొన్ని స్క్రిప్టులు రెడీ చేశా. ఆహా టీం ఓ సినిమా కోసం నన్ను సంప్రదిస్తే.. ఈ కథ పంపాను. నేను గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో రష్మికతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అల్లు అరవింద్‌ ది గర్ల్‌ ఫ్రెండ్‌ స్టోరీ విన్నప్పుడు ఈ కథను ఓటీటీ కంటే థియేటర్లలో చూపించడం బెటరన్నారని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు‌. రష్మికకు స్క్రిప్ట్‌ పంపించా. ఆమె నాకు రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసింది. పూర్తిగా చదివిన రష్మిక మందన్నా వెంటనే సినిమా చేసేందుకు ఒకే చెప్పింది. ఈ కథను అందరికీ చెప్పాల్సిన అవసరముందని అభిప్రాయపడిన రష్మిక.. స్క్రిప్ట్‌ బాగా కనెక్ట్‌ అయినట్టు చెప్పింది. నేనెప్పుడైనా ఓ కథ రాస్తే నా స్నేహితులైన సమంత, వెన్నెల కిశోర్‌, అడివిశేష్‌, డైరెక్టర్ సుజిత్‌కు చెప్పి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. గర్ల్‌ ఫ్రెండ్‌ స్టోరీ కూడా వారికి పంపించాను. అయితే ఈ మూవీలో సమంతను తీసుకుంటున్నానని పుకార్లు కూడా వచ్చాయి. కానీ సమంత స్క్రిప్ట్‌ చదివిన తర్వాత మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.. అలా రష్మికను ఫైనల్ చేశామన్నాడు రాహుల్ రవీంద్రన్‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :