Sunday, 08 February 2026 12:45:05 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Allu Arjun: ఇంతకీ.. అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ఏది?

Date : 17 September 2024 04:15 PM Views : 276

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రాలకు అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్‌ వుంది. ఇక ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ యువ కథానాయకుడు. గత రెండేళ్ల నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో వున్నాడు. చిత్రీకరణ చివరి దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. అయితే పుష్ప-2 ది రూల్‌ తరువాత ఈ అల్లు హీరో ఏ చిత్రంలో నటించనున్నాడని గత కొన్ని రోజులుగా ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించే సినిమా పట్టాలెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడని అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో అల వైకుంఠపురంలో సాధించిన రికార్డు వసూళ్లు బన్నీ కెరీర్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 తరువాత అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇటీవల అర్జున్‌ స్నేహితుడు బన్నీవాస్‌ కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ ప్రకారం చూస్తే పుష్ప-2 విడుదలకు దగ్గర్లోనే అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందని అర్జున్‌ సన్నిహితులు చెబుతున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలో సినిమా కూడా వుంటుందని, త్రివిక్రమ్‌తో సినిమా పూర్తవగానే ఆ సినిమా చిత్రీకరణ వుంటుందని టాలీవుడ్‌ ఇన్‌సైడ్ న్యూస్‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :