Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ ముగిసిన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి విచారణ అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. దీనికి సమాధానంగా... విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో పీఎస్ నుంచి ఇంటికి బయల్దేరారు. అల్లు అర్జున్ ప్రయాణించిన వాహనంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, వారి తరపు న్యాయవాది ఉన్నారు.
Also Read : తక్కువ ధరలో డ్యూయల్ స్క్రీన్, 5జీ... లావా బ్లేజ్ డ్యూయో 5జీ ఫోన్ ఫీచర్లు ఇవే!
Admin
Studio18 News