Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Home Town : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రతివారం కొత్త షోలు, సిరీస్ లు, సినిమాలు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సిరీస్ రానుంది. హోం టౌన్ టైటిల్ తో 2000 బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీ, పిల్లలు, పిల్లల చదువుల నేపథ్యంలో ఈ సిరిస్ రానుంది.
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి.. కీలక పాత్రల్లో శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో ఈ హోమ్ టౌన్ సిరీస్ తెరకెక్కింది. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నేడు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Admin
Studio18 News