Monday, 19 January 2026 07:48:07 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Tollywood | 2025 నవంబర్‌ టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ..ఎన్ని సినిమాలు హిట్, ఎన్ని ఫ‌ట్..!

Tollywood | 2025 నవంబర్‌ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కి పెద్దగా కలిసిరాలేదు. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల రీ-రిలీజ్‌లు, మధ్యస్థాయి సినిమాలు, చిన్న చిత్రాల

Date : 01 December 2025 07:13 PM Views : 408

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Tollywood | 2025 నవంబర్‌ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కి పెద్దగా కలిసిరాలేదు. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల రీ-రిలీజ్‌లు, మధ్యస్థాయి సినిమాలు, చిన్న చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చినా అవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. మొత్తం నెలలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒకే ఒక్క సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే. ముందుగా అక్టోబర్ 31న రీ-రిలీజ్ అయిన ‘బాహుబలి ది ఎపిక్’ తో పాటు, రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ తో నవంబర్ మొదలయ్యింది. బాహుబలి రీ-రిలీజ్‌కు ₹100 కోట్లు దాటుతుందని భారీ అంచనాలు ఉండ‌గా, కలెక్షన్లు ₹50 కోట్ల వద్దే ఆగిపోయాయి. రవితేజ ‘మాస్ జాతర’ మరో డిజాస్టర్‌గా ర‌వితేజ ఖాతాలో చేరింది. ఇక నవంబర్ 7న వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలోసుధీర్ బాబు ‘జటాధర’, రష్మిక మంధాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, సాత్విక్ వర్మ ‘ప్రేమిస్తున్నా’ రిలీజ్ కాగా వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కానీ థియేటర్లలో మాత్రం ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో కాసులు రాలేదు.ఇక ‘జిగ్రీస్’, ‘లవ్ OTP’, ‘సంతాప ప్రాప్తిరస్తు’ వంటి చిన్న సినిమాలు నవంబర్ 14న రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు పట్టించుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఏదీ నిలబడలేదు. ఇక మూడో వారం వచ్చిన సినిమాలు చూస్తే.. అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’, ‘ఇట్లు మీ ఎదవ’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘పాంచ్ మినార్’, ‘ప్రేమంటే’. ఈ చిత్రాల‌లో క్లీన్ హిట్‌గా నిలిచిన ఏకైక చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. చిన్న చిత్రంగా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ లాభాల బాట‌లో ఉంది. మ‌రోవైపు నవంబర్ 28 రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఆ చిత్రానికి జిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. మొత్తానికి 2025 నవంబర్ నెలలో టాలీవుడ్ లో వ‌చ్చిన ఒకే ఒక్క క‌మ‌ర్షియ‌ల్‌. ‘రాజు వెడ్స్ రాంబాయి’. మిగతా సినిమాలు విమర్శకుల ప్రశంసలు తెచ్చుకున్నాయి కానీ కలెక్షన్లు లేవు. దీంతో డిసెంబర్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల‌లో నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: థాండవం’ సహా పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రాబోతుండటంతో, డిసెంబర్ బాక్సాఫీస్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :