Saturday, 07 March 2026 08:21:37 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన మహిళ.. మరోసారి భద్రతా వైఫల్యం!

Date : 22 May 2025 05:15 PM Views : 479

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో మరోసారి ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్మాన్ నివాసంలోకి ఓ మహిళ చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి ఓ కారు చాటున నక్కి సల్మాన్ నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఆయన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఇషా ఛబ్రా (32) అనే మహిళ గురువారం సల్మాన్ నివాసం ఉండే భవనంలోని లిఫ్ట్ ఏరియా వరకు వెళ్లింది. ఆమె నటుడి నివాసంలోకి ప్రవేశించే లోపే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, బాంద్రా పోలీసులకు సమాచారం అందించి, ఆమెను వారికి అప్పగించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. గత ఏడాది కూడా సల్మాన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటన వెనుక కూడా లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేశారు. భద్రత కారణంగా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా, తనకు ఎలాంటి భయం లేదని, అంతా దేవుడే చూసుకుంటాడని సల్మాన్ గతంలో మీడియాకు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :