Monday, 19 January 2026 07:20:38 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Discover Andhra: ఏపీ వనం.. అద్భుత భూతల స్వర్గం.. దాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి: సాయి దుర్గా తేజ్

Date : 29 November 2025 06:12 PM Views : 147

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'డిస్కవర్ ఆంధ్ర' డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్ విడుదల సాయి దుర్గా తేజ్, నవదీప్ సారథ్యంలో డాక్యుమెంటరీ రూపకల్పన ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటవీ శాఖ పూర్తి సహకారం మన సంస్కృతి, ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన సాయి తేజ్ ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 'డిస్కవర్ ఆంధ్ర' అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపురి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. "మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఈ డాక్యుమెంటరీ చూస్తే తప్పక అనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2020లో 'గ్రీన్ పాస్' అనే ఎన్జీవో ప్రారంభించాను. నా 'రిపబ్లిక్' సినిమాలో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ఈ డాక్యుమెంటరీకి మణిశర్మ మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు, మీడియా మద్దతుగా నిలవాలి" అని కోరారు. హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ డాక్యుమెంటరీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం ఎలా లభించిందో వివరించారు. "ఆంధ్రలోని వైల్డ్‌లైఫ్‌ను ప్రపంచానికి చూపించాలనే తన కోరికను సాయి తేజ్ నాతో పంచుకున్నారు. నేను వెంటనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన తక్షణమే స్పందించి, ప్రాజెక్టుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేలా చూశారు. 72 నిమిషాల నిడివితో శ్రీకాంత్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ చూసి మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతారు" అని తెలిపారు. పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీ, ఏపీలోని అద్భుత‌మైన ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :