Saturday, 17 January 2026 09:52:42 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Tamareddy Bharadwaj: సినిమాలో దమ్ముండాలి .. చెప్పుతో కొట్టుకోవడం కరెక్ట్ కాదు: తమ్మారెడ్డి

Date : 04 September 2025 07:40 PM Views : 332

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అందరూ ప్రాణం పెట్టే సినిమా తీస్తారు ఏ సినిమా చూడాలనేది ఆడియన్స్ ఇష్టం స్టేజ్ పై ఛాలెంజ్ లు చేయకపోవడమే మంచిది పెద్ద సినిమాలకే జనాలు రావడం లేదు కంగారుపడకూడదన్న తమ్మారెడ్డి సీనియర్ దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజ్ కి మంచి పేరు ఉంది. ఎప్పటికప్పుడు ఆయన ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పుతో కొట్టుకోవడం గురించి, తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "ప్రతి దర్శకుడు కూడా తన సినిమాను ప్రాణం పెట్టే చేస్తాడు. అయితే ఆ సినిమాను చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టమే" అని అన్నారు. " ఈ రోజుల్లో స్టేజ్ లపై చాలామంది చాలా మాట్లాడుతున్నారు. నేను చింపేశాను .. పొడిచేశాను .. ఈ సినిమా ఇండస్ట్రీ అంతుచూస్తుంది అంటున్నారు. ప్రేక్షకుల ముందే ఛాలెంజ్ లు చేస్తున్నారు. నేను అంత కష్టపడ్డాను .. ఇంతకష్టపడ్డాను .. మీరు వచ్చి సినిమా చూడాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి కోసం వారు పడుతున్న కష్టాన్ని ప్రేక్షకులు ఎందుకు చూడాలి. ఆడియన్స్ కి చిన్న సినిమా .. పెద్ద సినిమా అనేమీ లేదు .. నచ్చితే చూస్తారు. అందుకు ఉదాహరణగా హిట్టయిన చిన్న సినిమాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కొంతమంది హీరోలకు మాత్రమే టికెట్లు తెగుతున్నాయి. హీరోయిన్స్ లో సాయిపల్లవి వంటి ఒకరిద్దరి సినిమాలకు మాత్రమే కాస్త క్రేజ్ ఉంది. మిగతా హీరోల సినిమాలకు జనాలు థియేటర్లకు రావడం లేదు. దిల్ రాజు .. సితార బ్యానర్ల నుంచి వచ్చిన పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు చేసిన సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి. మరి వాటిని ఏమనుకోవాలి. సక్సెస్ లు .. ఫెయిల్యూర్ లు ఇక్కడ సహజం. కంగారు పడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు" అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :