Saturday, 07 March 2026 08:21:10 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

Anee Master : జానీ మాస్ట‌ర్ ఇష్యూపై స్పందించిన అనీ మాస్ట‌ర్‌.. జానీ మాస్ట‌ర్‌తో 2 ఇయ‌ర్స్ క‌లిసి..

Date : 18 October 2024 02:08 PM Views : 284

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్ట‌ర్ అరెస్ట్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న జైలులో ఉన్నారు. కాగా.. జానీ మాస్ట‌ర్ ఇష్యూపై ప్ర‌ముఖ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ అనీ మాస్ట‌ర్ స్పందించారు. జానీ మాస్ట‌ర్ ఎంతో మంచివార‌ని, ఆయ‌న ద‌గ్గ‌ర రెండు సంవ‌త్స‌రాలు తాను అసిస్టెంట్‌గా ప‌ని చేసిన‌ట్లు చెప్పింది. జానీ మాస్ట‌ర్ కేసు విష‌యం విని తాను షాక్‌కు గురైయ్యాన‌ని, వారం రోజుల పాటు ఏం తోచ‌ని స్థితిలో ఉన్న‌ట్లు తెలిపింది. జానీ మాస్ట‌ర్‌కు వచ్చిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం త‌న‌ను చాలా బాధించింద‌ని అనీ మాస్ట‌ర్ అంది. జానీ త‌ప్పు చేశార‌ని ఇంకా ఫ్రూవ్ కాలేదు. నేరం రుజువు కాక‌ముందే అవార్డు క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యం స‌రైంది కాద‌ని అంది. ఆయ‌న ద‌గ్గ‌ర తాను రెండు సంవ‌త్స‌రాలు వ‌ర్క్ చేశాన‌ని, ఆయ‌న ఎంతో మంచి వార‌ని తెలిపింది. ఆయ‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం భాదాక‌ర‌మంది. నిజంగా జానీ మాస్ట‌ర్ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తేలితే ఏంటి? అని ప్ర‌శ్నించింది. ఓ మ‌హిళా కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నాను.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్ట పడాలని, తన‌ కెరీర్‌లో త‌న‌కు ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదని అనీ పేర్కొంది. అప్ప‌ట్లో జానీ మాస్ట‌ర్ మంచివాడు, గొప్ప వ్య‌క్తి అని మీడియా ముందుకు చెప్పిన ఆ అమ్మాయి ఇప్పుడు అదే జానీ మాస్ట‌ర్ పై కేసు పెట్ట‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యంగా ఉందని తెలిపింది. ఓ డాన్సర్‌కు హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది జానీ, శేఖర్, భాను మాస్టర్స్ అని, డాన్స్ మాస్టర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్‌‌గా ఉంటుంది. ఇక ఏదీ ఏమైన‌ప్ప‌టికి కోర్టు తీర్పు ఎలా ఉంటుందోన‌ని అంద‌రం ఎదురుచూస్తున్న‌ట్లుగా అనీ మాస్ట‌ర్ అంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :