Monday, 19 January 2026 07:30:34 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్!

Vicky Kaushal | బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంప‌రాఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమాతో పాటు

Date : 09 December 2025 07:55 PM Views : 118

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Deepika Padukone | బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంప‌రాఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో దీపిక (Deepika Padukone) భాగం కాబోతున్న‌ట్లు స‌మాచారం. ‘స్త్రీ 2’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు అమ‌ర్ కౌశిక్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో (Vicky Kaushal) కలిసి ‘మహావతార్‌’ (Mahavatar) అనే చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో క‌థానాయిక‌గా దీపికాను తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జ‌రుప‌గా దీపికా కూడా ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోందట. అందుకే ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు అమర్ కౌశిక్, ఇప్పటికే ఆరు నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇది తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :