Thursday, 12 March 2026 03:39:02 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

కానీ నేను సర్జరీ జోలికి వెళ్లలేదు.. నటనే ప్రధానం అనుకున్నా: వెన్నెల కిశోర్

Date : 13 May 2025 12:04 PM Views : 363

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అనేక సినిమాల్లో నటించినప్పటికీ, తన డ్రీమ్ రోల్ మాత్రం దూకుడు చిత్రంలోని పాత్రేనని ఆయన చెప్పారు. ఆ సినిమాలో మహేశ్ బాబు సరసన అంత మంచి పాత్ర రావడంతో తన కల నెరవేరిందని అన్నారు. ఆ సినిమా కోసం డైరెక్టర్ శ్రీను వైట్ల కథ చెప్పిన సమయంలో తాను లావుగా ఉన్నానని, పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సన్నగా కనిపించాలని చెప్పారన్నారు. అవసరమైతే సర్జరీ చేయించుకోమని కూడా సలహా ఇచ్చారని, కానీ తాను సర్జరీ జోలికి వెళ్లలేదని అన్నారు. వ్యాయామాలు చేసినా అనుకున్నంత సన్నబడలేదని, అయినా అలానే నటించానని, అదే ఆ పాత్రకు కలిసి వచ్చిందని చెప్పారు. ఆ నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయని తెలిపారు. అప్పటి నుంచి తాను నటనను మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నానని వెల్లడించారు. కొన్నిసార్లు పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోవాలని చెబుతున్నా, అది తన శరీరానికి సరిపడటం లేదని, అయినా దర్శకులు తనను భరిస్తున్నారంటూ చలోక్తి విసిరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :